Breaking News

టీచరమ్మగా కలెక్టరు డా. మాధవీలత…

-తరగతి గదిలోనే విధ్యార్థులతో కలసి సహపక్తి భోజనం..
-నైపుణ్యాభివృద్ది ద్వారా ఇంగ్లీషు మాధ్యమం నేర్చుకోవడం సులభం..
-కలెక్టరు డా. మాధవీలత

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు నాడు-నేడు ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు మాధవీలత పేర్కొన్నారు. శనివారం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో యంపీపీయుపీ పాఠశాలను ఆకస్మికంగా కలెక్టరు తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో చదుకునే విద్యార్థులకు ఆంగ్ల మాథ్యమంలో పాఠాలను నేర్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రతి ఒక్క విద్యార్థినీ ఆంగ్ల భాషను నేర్చుకోవడంలో ఆసక్తిని పెంచుకోవాలన్నారు. మాతృభాషతో పాటు ఇతర భాషల పట్ల కూడా మక్కువ పెంచుకోవడం ద్వారా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోగలమని కలెక్టరు విద్యార్థులకు తెలిపారు. నిరంతర సాధన ద్వారా ఏదైనా సాద్యమవుతుందన్నారు. పాఠశాలల్లో పారిశుధ్యం ఎలా ఉందని పిల్లను అడిగి తెలుసుకున్నారు. మద్యాహ్నం భోజన పథకం, ఉపాధ్యాయుల బోధనా విధానం పై వివరాలను అడుగగా పిల్లలు చక్కటి ఆహారాన్ని అందించడంతో పాటు ఉపాధ్యాయులు మాలోని అభిరుచి అనుగుణంగా పాఠాలను భోధిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కె. శ్రీవిద్య అనే విద్యార్థినీ ఆంగ్లంలో మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కగా భోధిస్తున్నారని, చక్కని వాతావరణం పాఠశాలలో ఉందని తెలిపారు. మధ్యాహ్న భోజనం సమయం అవ్వడంతో విద్యార్థులకు అందజేసే ఆహారాన్ని తరగతి గదిలో విద్యార్థులకు అందించాలని వారితో కలసి ఆ పదార్థాలను రుచి చూస్తానని కలెక్టరు తెలుపగా, వెంటనే ఉపాధ్యాయులు తరగతి గదిలోనే విద్యార్థులకు భోజనం అందజేసారు. వారితో పాటు కలెక్టరు వారి మద్యలోనే కూర్చుని భోజనం చేస్తూ రోజు ఇదే విధంగా ఆహారాన్ని అందిస్తున్నారా? అని పిల్లలను అడగగా .. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చింది. పాఠశాల ప్రాంగణంలో టాయిలెట్స్ నిర్వాహన బాగుందని విద్యార్థులు కలెక్టరుకు తెలిపారు. కలెక్టరు వెంట యంఇవో స్వామినాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తాహశీల్థారు ఎన్. సత్యనారాయణ, ఎంపీడీవో రమేష్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *