రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి ఒక్క శాఖాధికారి చేపట్టవలసిన పనుల లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఫలితాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశాలు జారీ చేశారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఘర్ ఘర్ తిరంగ, ప్రాధాన్యత భవనాలు, సి సి ఆర్ సి కార్డ్స్, సర్వే అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత సమీక్షిస్తూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా గ్రామాల్లో చేపట్ట వలసి ఉంటుందని తెలిపారు. ఆగస్ట్ ఒకటి కల్లా మండలం లో ఉన్న ప్రధాన కూడలి, స్థలం లో సెల్ఫి పాయింట్ ఏర్పాటు చెయ్యాల్సి ఉంటుందని, తహశీల్దార్, ఎం పి డి ఓ, ఏంఈఓ లు సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. సెల్ఫి పాయింట్ వద్ద ఫోటో తీసుకుని గ్రూప్ లో అప్లోడ్ చెయ్యలన్నారు. జిల్లా స్థాయి లో జాతీయ జెండాలను సేకరించి మండలాలకు పంపడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను మార్గదర్శకాలు మేరకు ఎగురవేయడంలో అత్యంత జాగ్రత్త అవసరం అన్నారు. ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే సంబంధించిన ఎమ్ పి డి వో దే భాధ్యత అన్నారు. జాతీయ జెండా తో పాటు కర్ర కూడా సరఫరా చేస్తామని తెలియచేశారు. ఆగస్ట్ 2 జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య జన్మ దినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఆగస్ట్ 1 నుంచి 15 వరకు “అజాదికా అమృత్ మహోత్సవ” ఘనంగా చేపట్టాల్సి ఉందన్నారు. ఆయా రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాల వివరాలను ఇప్పటికే తెలియ చేశామని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఆగస్ట్ 2, 13, 14 తేదీల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తూన్న దృష్ట్యా ఆయా రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. డివిజన్ స్థాయి లో ఆర్డీవో లు ప్రత్యేక పర్యవేక్షణ అవసరం అన్నారు.
ఓటర్ల జాబితా సవరణ కోసం స్పెషల్ సమ్మరీ ఆగస్ట్ 4 నుంచి అక్టోబర్ 21 వరకు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు.1500 పైగా ఓటర్లు ఉన్న బూత్ లను తిరిగి హేతుబద్ధీకరణ విధానంలో మార్పులు చేపట్టవలసి ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నూతన మార్గదర్శకాలు మేరకు దరఖాస్తు లలో నూతన విధానం అమలులోకి వచ్చిన దృష్ట్యా క్షేత్ర స్థాయి లో బి ఎల్ ఓ లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఓటరు గుర్తింపు కార్డు ను ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డ్ ద్వారా అనుసంధానం చేయాలన్నారు. ఈ డేటా ఎంట్రీ సమయంలో ఎటువంటి పొరపాట్లు కి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత తహశీల్దార్లు తీసుకోవాలని, ఎంట్రీ విషయంలో తప్పిదం ఉంటే సంబంధించిన అధికారి దే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం కోసం సేకరణ చేపట్టిన భూములకు సంబంధించిన ఎటువంటి వివాదాలకు తావులేకుండా చూసుకోవాలని కలెక్టర్ మాధవీలత తెలిపారు. మ్యూటేషన్స్ సంబంధించి దరఖాస్తులు ఎప్పటికప్పడు పరిష్కారం చూపాలని, ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితి లోగా పరిష్కారం చూపకపోతే ఇకపై ఉరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సి సి ఎల్ ఏ వారం వారం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రాప్ నమోదు విషయం కౌలు రైతులకు, భూ యజమానులకు కూడా చెయ్యడం గుర్తించామని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. కడియం మండల అగ్రికల్చర్ అధికారి విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవరిస్తున్నట్లు గుర్తించామన్నారు. షో కాజ్ నోటీస్ ఇవ్వాలని సంబందించిన అధికారిను ఆదేశించారు. ఈ క్రాప్ విధానంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి, వాస్తవంగా ఉన్న భూమి కంటే ఎక్కువ భూమి ఉండడం గుర్తించామని, గ్రామ స్థాయి లో గ్రామ కార్యదర్శి, రెవెన్యూ అధికారి, వ్యవసాయ సహాయకులదే భాధ్యత అన్నారు. కడియం, రంగంపేట, బిక్కవోలు, దేవరపల్లి, గోకవరం మండలాల్లో సి సి ఆర్ సి కార్డుల విషయం లో వెనుకంజలో ఉన్నారని పేర్కొన్నారు. అర్భికే ఏర్పాటు చేసే విధానం లో కూడా గోకవరం, కొవ్వూరు, సీతానగరం, రంగంపేట, బిక్కవోలు స్థలాలు గుర్తించాల్సి ఉందన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఏర్పాటు కి సంబంధించి 59 యూనిట్స్ కి గాను 30 చోట్ల భూముల సేకరణ పెండింగు లో ఉన్నాయని తెలిపారు. బిక్కవోలు , అనపర్తి, కడియం లో 3 చొప్పున, నిడదవోలు, పెరవలి లో 4 చొప్పున, ఉంద్రజవరం లో ఐదు చోట్ల స్థల సేకరణ పెండింగు లో ఉన్నట్లు తెలిపారు. సోమవారం నాటికి అనువైన స్థలాలు గుర్తించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో రీవాల్యూషన్ వెంటనే తీసుకోవాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే పనుల కోసం క్షేత్ర స్థాయి లో బృందాలను ఏర్పాటు చేస్తే ఆ మేరకు ఫలితాలు ప్రతిబింబించడం లేదనీ పేర్కొన్నారు. ప్రతి రేషన్ షాప్ వద్ద జాతీయ జెండా ఎగురవేసేలా చుడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవో లు ఏ.చైత్రవర్శిని, ఎస్. మల్లిబాబు, ఎస్.ఈ (పీఆర్) ఏ బి వి. ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, సివిల్ సప్లైఎస్ అధికారి ప్రసాదరావు, ఎ డి సర్వే ఎమ్. విష్ణు వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News