Breaking News

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ది.01-08-2022 నుండి 15-08-2022 వరకు (15 రోజులు) పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమములో ప్రజలందరు స్వచ్చందంగా భాగస్వామములై దేశ స్వాతంత్ర ఉద్యమములో పోరాడిన ఎందరో మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోదులను కీర్తించుకోనవలసిన ఆవశ్యకత మనందరిపై ఉన్నదని నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పిలుపునిచ్చారు.

కార్యక్రమముల వివరాలు…
01-08-2022 –ప్రజలకు చైతన్యవంతులను చేయుటకు వార్డు కార్యదర్శులు ద్వారా అవగాహన ప్రచార కార్యక్రమము.
02-08-2022 – భారత త్రివర్ణ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య మరియు శ్రీ బళ్లారి రాఘవ జయంతి ఉత్సవాల నిర్వహణ
03-08-2022 – శ్రీ కాకాని వెంకట రత్నం జయంతి ఉత్సవాల నిర్వహణ మరియు స్వాతంత్ర్య సమరయోధులపై సెమినార్లు నిర్వహించడం
04-08-2022 – పాఠశాల, కళాశాల మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో దేశభక్తి గీతాలలో పోటీల నిర్వహణ.
05-08-2022 – పేట్రియాటిక్ డ్రామా/మోనో యాక్షన్ ప్రదర్శనల నిర్వహణ.
06-08-2022 – దేశభక్తి నేపథ్యంపై ప్రదర్శనల నిర్వహణ
07-08-2022 – నగరంలోని పలు ప్రదేశాలలో ర్యాలీల నిర్వహణ
08-08-2022 – డ్రాయింగ్ & పెయింటింగ్, ఎలోక్యూషన్ మరియు డిబేట్‌ కార్యక్రమముల నిర్వహణ మరియు పోస్టర్ మేకింగ్, జింగిల్స్ మొదలైనవి.
09-08-2022 – దేశభక్తి థీమ్‌పై సాంస్కృతిక ఉత్సవం/కార్యక్రమాన్ని నిర్వహించండి.
10-08-2022 – శ్రీ వి.వి.గిరి జయంతి ఉత్సవాల నిర్వహణ, సభ నిర్వహించడం ఆర్టీలు, కీర్తనలు, సమాజ కార్యకలాపాలను ప్రోత్సహ కార్యక్రమములు
11-08-2022 – వారసత్వ నడకల నిర్వహణ
12-08-2022 – వివిధ క్రీడలలో పోటీల నిర్వహణ
13-08-2022 – జాతీయ జెండాతో సెల్ఫీ కండక్ట్
14-08-2022 – స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్లకు పాదయాత్రలు నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం కార్యక్రమములు
15-08-2022 – పాదయాత్రలు మరియు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *