విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో ఇంగ్లీష్ మీడియం బోధనా పద్ధతులను పరిశీలిస్తున్న ఉత్తర ప్రదేశ్ బృందం రెండవ రోజు గంపలగూడెంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ మోడల్ స్కూళ్లను సందర్శించింది. అక్కడ రెసిడెన్షియల్ పద్ధతిలో జాటున బోధన విధానాలు వసతులు విద్యార్థుల్లో ప్రావీణ్యాన్ని పరిశీలించింది. నగరానికి దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో సైతం విద్యార్థుల్లో ఆంగ్ల పాటవాన్ని బృందం ప్రశంసించింది. అనంతరం విజయవాడలో రాష్ర్ట విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, డిజిటల్ బోధన, ద్వి భాషా పుస్తకాల గురించి వివరించారు. రాష్ట్ర వినూత్న పథకాలను యూపీ బృందం ప్రశంసించారు. అనంతరం ఎస్సీఈఆర్టీ అధ్యాపకులతో జరిగిన సమావేశంలో వివిధ శిక్షణా కార్యక్రమాల గురించి ఎస్సీఈఆర్టి లెక్చరర్ సతీష్ వివరించారు.
Tags vijayawada
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …