విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ మొగల్రాజపురం వద్ద దాదాపు 45లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అట్లూరి పరమాత్మ స్ట్రీట్ రిటైనింగ్ వాల్,మరియు రుక్మిణి రైస్ మిల్ రోడ్డు నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రిటైనింగ్ వాల్ కూలిపోయి ఇబ్బందులు పడుతున్న విషయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు మా దృష్టికి తీసుకురాగా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేపించడం జరిగిందని వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేస్తామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని కొండ ప్రాంతం అధికంగా ఉన్న కారణంగా నాయకులు ఎవరూ వచ్చేవారు కాదని కానీ నేడు జగనన్న ప్రభుత్వం లో నేరుగా మా ఇంటి వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు అని ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అవినాష్ తెలిపారు. స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కృషి చేస్తున్నారు అని అన్నారు.కొండ ప్రాంతంలో పని చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోతే వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి అండగా ఉంటామని ధైర్యం చెప్పి పనులు మొదలేపెట్టేలా ప్రోత్సహించారని అన్నారు.ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేయడంతో పాటు కులమత పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా పాలన అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం అసత్య ప్రచారాలు,డ్రామాలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మేరకనపల్లి మాధురి,కలపాల అంబేద్కర్, వియ్యపు అమర్నాధ్, వైసీపీ నాయకులు వేగే వెంకటేశ్వరరావు, కుటుంబరావు, సంపత్,సొంగా రాజ్ కమల్,పాటిబండ్ల హరీష్,క్లైవ్,చోడవరపు రవి,నాగులు,అశోక్,సుజాత తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …