-నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిధిలోని 18 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరు విధిగా ప్రికాషన్ డోస్ (బూస్టర్ డోస్) వేయించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పిలువునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గతంలో వేసుకోనిన రెండు డోస్ ల వ్యాక్షిన్ మాదిరిగా మీకు దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్లకు వెళ్లి మూడోవ డోస్ అయిన ప్రికాషన్ డోస్ తప్పని సరిగా వేయించుకోవాలని అన్నారు.