కలలను సాకారం చేసుకుని భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చెరుకునే విధంగా లక్ష్యలను నిర్థేశించుకోవాలి…

-నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు…
-జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్ననాటి నుండే లక్ష్యాలను నిర్థేశించుకుని వాటిని చేరుకునే విధంగా సాధన చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ విద్యార్థులకు ఉద్బోందించారు.
శనివారం నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో అమ్మఒడి హ్యండ్‌ రైటింగ్‌ మరియు కాలిగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా స్థాయి కాలిగ్రఫీ హ్యండ్‌ రైటింగ్‌ సర్టిఫికేట్స్‌ డిస్టిబ్యూషన్‌ కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా కలలు కంటారని అయితే ఆ కలలను సాకారం చేసుకోవాలంటే నిరంతర సాధన తప్పనిసరి అన్నారు. ఏ రంగంలోనైనా నైపుణ్యం ఉంటే సమాజంలో గుర్తింపు గౌరవం ఉంటుందన్నారు. ఇష్టపడి చదవడం వల్ల ఆయా రంగాలలో రాణిస్తారని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. అమ్మఒడి హ్యండ్‌ రైటింగ్‌ మరియు కాలిగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు ఐదవ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 25 వేల మంది ఒకటి నుండి ఆరవ తరగతి విద్యార్థులకు చేతి వ్రాతపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల సంస్థ ప్రిన్సిపల్‌ భువనచంద్రను జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అభినందించారు.
ఈ ఏడాది ప్రధమ ద్వితీయ తిృతీయ స్థానాలలో నిలిచిన ఎస్‌. జివితేష్‌, ఏ ఆదిరెడ్డి, మణుశ్రీ, పులి పూజితలను జాతీయ స్థాయిలో వచ్చే ఏడాది జనవరి 22వ తేదిన ఢల్లీిలో నిర్వహించే జాతీయ చేతివ్రాత పోటీలలో పాల్గొనున్నందున జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ ప్రత్యేకంగా అభినందించారు.90 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లను మెమోంటోలను ప్రధానం చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, అమ్మఒడి హ్యండ్‌ రైటింగ్‌ మరియు కాలిగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ లోలుగు శేఖర్‌, కాలిగ్రఫీ నిపుణులు పి. భువనచంద్ర, హ్యండ్‌ రైటింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ హోస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *