విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజాధి కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 14-08-2022 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ఇంటివద్ద సర్వమత సంఘాలు అందరూ ఒక్కటై తిరంగా సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని పతాకాన్ని బుజాన వేసుకొని నడిచారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ 75ఏళ్ల స్వాతంత్ర భారతదేశం ఎందరో త్యాగ ఫలితమే అన్నారు. అజది కా అమృత్ మహోత్సవ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.. రాబోయే రోజుల్లో కూడా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని భారత దేశం మరింత పురోగతి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రేపు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ నగర్ నుండి జరగబోయే బైక్ ర్యాలీ లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ ఐక్యతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు వల్లభనేని సతీష్, గార్లపాటి విజయ్, అన్వర్, బాషా, ఘంటా కృష్ణ మోహన్, గొట్టుముక్కల వెంకీ, కోలా దుర్గారావు, బాబీ, మెహర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …