విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్, డాబా కోట్లు సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ 58వ డివిజన్ అధ్యక్షులు షేక్ మాబు వలి ఆధ్వర్యంలో సోమవారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వలిబోయిన గురునాధం ముఖ్య అతిథిగా విచ్చేసి జండా ఆవిష్కరణ చేసి దేశం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. వలిబోయిన గురునాధం మాట్లాడుతూ నేటితో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టామని దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినందున దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు జరుపుకోవడం భారతీయులుగా మన అదృష్టమని, జాతి అభివృద్ధి కోసం దేశ స్వాతంత్ర్యం కోసం నాటి బ్రిటిష్ పాలకుల నుండి దాస్య శృంఖలాలను తెంచి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యం తెచ్చిన స్వాతంత్ర సమరయోధులను ఎప్పటికీ మన గుండెల్లో పెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షులు షేక్ అన్సారీ, నగర ప్రధాన కార్యదర్శులు ఓంకార్, జగన్ డివిజన్ అధ్యక్షులు మామిడాల రమణ, బగ్గా రమణ, ఇస్మాయిల్ మరియు ఎన్.ఎస్.యు.ఐ. నాయకులు బత్తుల అంకమ్మరాజు, రాయవరపు రాజు, ఉప్పు జస్వంత్, హేమంత్, మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …