Breaking News

ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఘనంగా76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 76వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు ఫెడరేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి జాతీయ జండాని ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి75 సంవత్సరాలు పూర్తి అయి 76వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్రం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం వలన లభించిందని వారిని ప్రతిఒక్కరూ స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకుని బి.సి.ల రాజ్యాధికారం కోసం పాటుపడాలని సూచించారు. ఈకార్యక్రమంలో దేవాంగుల రాష్ట్ర అధ్యక్షుడు శీలం లెనిన్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, అధ్యక్షుడు పడమటి రవి, సిటీ మహిళా అధ్యక్షురాలు దామర్ల సాంబ్రాజ్యం, యూత్ లీలాకృష్ణ, చందు, జోసెఫ్, సామ్రాట్ స్థానిక మహిళలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *