Breaking News

స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ దక్కాలి… :  గయాజుద్దీన్(ఐజా)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర ఉద్యమ ఫలాలు ప్రజలందరికీ దక్కాలని జనసేన నగర అధికార ప్రతినిధి మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) అన్నారు. సోమవారం 46వ డివిజన్లోని లంబాడి పేట సాయిరాం సెంటర్ లో స్థానిక జనసేన నాయకులు మైనర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గయాజుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం స్థానిక మహిళలకి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గయాజుద్దీన్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే బ్రిటిష్ వారి నుంచి మన దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు. స్వాతంత్ర ఫలాలు అందరికీ చెందిన నాడే నిజమైన స్వాతంత్రం లభించినట్లనీ ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో దుర్గారావు, శివ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *