Breaking News

ప్రెస్ క్లబ్ నందు ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

– స్వాతంత్ర సమరయోధుడు కమలాపురం.మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,కిర్తిశేషులు, సీతారామయ్య సతీమణి స్వాతంత్ర సమరయోధురాలు రాసువ పద్మాపతమ్మచే జాతీయ పతాకావిష్కరణ
– మహనీయులు అడగజాడల్లో నడుద్దాం.. విశిష్ట అతిధులు

ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 76 ప స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ నందు సోమవారం  ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 4వ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి సౌజన్యంతో ప్రెస్ కమిటీ ఎడిటర్లు రమేష్ కాకర్ల, బసిరెడ్డి రమణా రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక శ్రీరాములు పేటలోని మువ్వన్నెల పతాకాన్ని స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్యే,,ఎమ్మెల్సీ సతీమణి స్వాతంత్ర సమరయోధురాలు రాసుప పద్మావతమ్మ ఆవిష్కరించారు. జాతీయ జెండాకు వందనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమానికి ఏపిపిలు బందెల ఓబులేసు,రాంప్రసాదు రెడ్డి,తహశీల్దార్ యండి నజీరుద్దీన్,మునిసిపల్ కమీషనర్ పి.వి.రమణయ్య, సహాయ మునిసిపల్ కమీషనర్,అడ్వకేట్లు సి.వి. సురేష్, ఆర్.వి.భాస్కర్ రావు, వన్ టౌన్ సిఐ రాజారెడ్డి, టూటౌన్ సిఐ ఇబ్రహీంలు విశిష్ట ఆతిధులుగా పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవం 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ దేశాన్ని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన సమరయోధుల పోరాటంతో నేడు మనం ఇలా స్వేచ్చా వాయులను పీలుస్తున్నామని ఆనాటి వారి పోరాటపటిమను గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామాజ్యం అంతరించి, భారతదేశ స్వేచ్ఛకూ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా త్రివర్ణపతాకం ఆవిష్టతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ చారిత్రిక సందర్భాన్ని పురస్కరించుకొని, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేర దేశసమేఖ్యత కోసం ఆజీదీ కా అముత్ పేరుతో కార్యక్రమాలు హర్ గర్ తిరంగా నినాదంతో దేశ సమైఖ్యతను చాటామని తెలిపుతూ ప్రజా స్వామ్యంలో నాలుగవ స్తంభంగా జర్నలిం ఉందని సిఐలు రాజారెడ్డి,ఇబ్రహీంలు సంయుక్తంగా పేర్కొన్నారు. ఆనంతరం స్వాతంత్య్రసమరయోధుడు మాజీ ఎమ్మెల్యే,,ఎమ్మెల్సీ సీతారామయ్య.సతీమణి స్వాతంత్ర్య సమరయోధురాలు రానువ పద్మావతమ్మ ఆమె కుమారుడు భాస్కరరావు మాట్లాడుతూ నాడు స్వాతంత్రోద్యమంలో తమ తల్లిదండ్రులు పాల్గొనడం ఎంతో మహనీయమణి మహాత్మ గాంధీ పిలుపుతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడం జాతీకి, దేశానికి చేసిన సేవ ఎంతో అదృష్టమని తెల్లదొరల పాలనపై తిరుగుబాటపట్టి వారిని దేశం దాటేలా చేసి తెచ్చుకున్న స్వాతంత్రమని తెలిపారు.నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం. స్వాతంత్య్ర పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,తొలి హెూంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలని మహనీయుల అడగజాడల్లో నడవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ వారు విచ్చేన విశిష్ట అతిధులను దుశాలువో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *