విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పరిధిలోని అన్ని డివిజన్లల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం చేయడం జరిగినది. ఈ రోజు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి. సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, నలుగురు AMOH ఆఫీసర్లు, ఆరుగురు శానిటరీ సూపర్వైజర్లతో కలిసి మీటింగ్ నిర్వహించడం జరిగినది. ముందుగా అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అమలుచేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు. నగరంలో ప్రతి రోజు ఈ ప్లాస్టిక్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఎక్కడైతే ప్లాస్టిక్ వాడుతున్నారో తనిఖి చేసి వారికి ఎక్కువ మొత్తంలో జరిమానా విధించామని ఆదేశించడమైనది. ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు, కూడా ప్రతిరోజు ఆయా డివిజన్లలో ప్లాస్టిక్ అమ్మే షాపులను తనిఖీ చేసి అందరు విధిగా ప్లాస్టిక్ బ్యాన్ అమలుచేయవలసినదిగా అదేశిచినారు. ఒకసారి వినియోగించి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయడం, దిగుమతి చేయడం, నిల్వచేయడం, పంపిణీ, విక్రయంతో పాటు ఉపయోగించడం చట్ట ప్రకారం నిషేధించినట్లు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) తెలిపారు. హోటల్స్, వాణిజ్య షాపులు, రిటైలర్లు, అమ్మకందారులు, వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, మాల్స్‌తో పాటు ఇతర సంస్థల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరికరాలు, క్యారీ బ్యాగులు నిల్వచేయడంతో పాటు వినియోగించినట్లు తేలితే ఆయా దుకాణాలు, షాపుల వాణిజ్య లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …