పేదలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించిన జగనన్న ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వలన నిరుపేదలకు ఆర్థిక,సామాజిక గౌరవం, భద్రత కలిగాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ 112వ సచివాలయ పరిధిలోని విజయ్ కుమార్ రోడ్,నిమ్మకాయల లక్ష్మణ్ రావు రోడ్,సతీష్ కుమారు రోడ్,మంగలి వారి రోడ్,ఆయిల్ కొట్టు బజార్,మసీద్ రోడ్ ప్రాంతాలలో పర్యటించిన అవినాష్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాలను కరపత్రాల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమం లక్ష్యంగా పారదర్శకంగా పధకాలు అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రభుత్వం ద్వారా పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ లబ్ది పొందారని,అందుకే ప్రజల్లోకి వస్తున్న వైస్సార్సీపీ నాయకులకు మహిళలు హారతులు పడుతూ బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం లో మా ప్రాంతంలో అసలు అభివృద్ధి జరగలేదు అని,అన్ని అర్హతలు ఉన్న సరే అసలు మాకు ఆ ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి జరగలేదు అని,ఇళ్ళు పేరుతో టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చేసి మోసం చేసారని ప్రజలు వాపోయారు.కానీ నేడు జగనన్న ప్రభుత్వం లో వాలంటీర్ లే ఇంటికి వచ్చి మరి పధకాలు అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అవినాష్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురుంచి, ప్రజల బాగోగులు గురుంచి పట్టించుకోకుండా గాలికొదిలేసి నేడు ఆయన రాజకీయ మనుగడ,ప్రచార పిచ్చితో ప్రభుత్వం మీద లేనిపోని విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేలా 80లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని,ఆ సెంటర్ పెట్టేటప్పుడు టీడీపీ నాయకులు లేనిపోని అసత్యాలు చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేసి అడ్డుకున్నారని,కానీ నేడు అది ఏర్పాటు చేసిన తరువాత దాని పనితీరు చూసి వారే మద్దతు గా నిలిచారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది అని అవినాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,దుర్గారావు,దర్గా,గోపాల్ రెడ్డి,ప్రబాకర్ రెడ్డి, నాగిరెడ్డి,రమణారెడ్డి, ఫజులుద్దీన్, ప్రభాకర్,జావీద్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ ఆయిల్ కొట్టు బజార్ నందు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు నిరుపేద దివ్యంగురాలు వెంకట నాగలక్ష్మి, మలేరియా హాస్పిటల్ వద్ద నివాసముండే వృద్దుడు దుర్గాప్రసాద్ లు తమకు పెన్షన్ రావడం లేదు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన దృష్టికి తీసుకురాగా తక్షణమే సంబంధిత సచివాలయ సిబ్బందికి పెన్షన్ మంజూరు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.వారి జీవనోపాధి కొరకు అవినాష్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇద్దరికి కలిపి 20,000/- రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం

-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు  -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *