C.D.M.A ప్రవీణ్ కుమార్ ని కలిసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్ I.A.S ని మంగళగిరి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్మెంటల్  సెక్రటరీస్ (గ్రేడ్- 2 )వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.
1. శానిటేషన్ కార్యదర్శుల జాబ్ చార్ట్ ను సక్రమంగా అమలు చేయాలని,
2. జనన, మరణ, వివాహ, శానిటేషన్ సర్టిఫికెట్ , ట్రేడ్ లైసెన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మరియు డాగ్ లైసెన్స్ మొదలగు సర్టిఫికెట్లు మొదట శానిటేషన్ సెక్రెటరీ వారి లాగిన్లలో ఉన్నవి ప్రస్తుతం ఆ సర్వీసులన్నీ WEDS లాగిన్లకు బదిలీ చేసి ఉన్నారు వాటిని మరలా WSES లాగిన్లలో ఇవ్వాలని,
3. ఆదివారాలు రెండో శనివారాలు పండగలకు మాకు ఎటువంటి సెలవులు ఇవ్వడం లేదు కనుక మాకు సెలవు ఇవ్వాలి,
4. యూజర్ చార్జీలను వసూలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. కనుక తమరు మా యందు దయుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి మరొక విధంగా ఒత్తిడి లేని మార్గంలో చార్జీలను వసూలు చేసే విధంగా మార్గదర్శకాలు ఇవ్వమని కోరుతున్నామని…
పై సమస్యలన్నింటిపై కమిషనర్  స్పందిస్తూ  జాబ్ చార్ట్ ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని సెలవులు కూడా మంజూరు అయ్యేలాగా చూస్తామని, WEDS లాగిన్లలో ఉన్న సర్టిఫికెట్లు WSES లాగిన్లకే వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని యూజర్ చార్జీల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జి. రాజేష్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీరామ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా కార్యదర్శి సిహెచ్ కృష్ణ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మోకా. శ్రీను పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *