-జులై మాసం నివేదిక విడుదల చేసిన డీపీఐఐటీ
-ఏడు నెలల వ్యవధిలో రూ.40 వేల కోట్లు రాబట్టిన ఏపీ
-రెండో స్థానంలో ఒడిశా
-దేశంలో ఈ రెండు రాష్ట్రాల వాటా 45 శాతం
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :
ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా అవతరించింది. డీపీఐఐటీ (డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) జులై నెల నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఏడు నెలల వ్యవధిలో ఏపీ రూ.40,361 కోట్లు రాబట్టినట్టు ఆ నివేదిక పేర్కొంది. ఏపీ తర్వాత రెండో స్థానంలో ఒడిశా నిలిచింది. ఒడిశా ఏడు నెలల కాలంలో రూ.36,828 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. దేశంలో పెట్టుబడుల విషయంలో ఈ రెండు రాష్ట్రాలది 45 శాతం అని డీపీఐఐటీ తెలిపింది. ఈ ఏడు నెలల వ్యవధిలో దేశం మొత్తం మీద 1.71 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించింది.