-ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు అవగాహన కల్పించాలి,
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయము నందలి కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూలై ఒకటవ 1 నుండి దేశవ్యాప్తంగా సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధించబడినది ఈ మేరకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా విజయవాడలోని మూడు సర్కిల్లో ప్రతి సర్కిల్లో కూడా 5 డిపార్ట్మెంట్ల నుండి జోనల్ కమిషనర్ టీం లీడర్ గా 12 మంది సభ్యులతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం లను వేయడం జరిగినది. ఈ ఎన్ఫోర్స్మెంట్ టీoలు వారికి కేటాయించిన సర్కిల్లో ప్రతి షాపు కూడా రైడింగ్ చేసి ప్లాస్టిక్ ను నిషేధించి వారికి ఒక జ్యూట్ బ్యాగ్ గాని క్లాత్ బ్యాగ్ గాని ఒక నమూనా లాగా ఇవ్వాలని ఆదేశించడం అయినది.
అదే విధంగా రేపు ఒక్కరోజు మాత్రమే వ్యాపారులందరూ స్వచ్ఛందంగా వారి దగ్గర ఉన్న సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ ను నగరపాలక సంస్థ అధికారులకు డొనేట్ చేసే అవకాశం కల్పించారు.ప్రజలందరూ ఈ ప్లాస్టిక్ నిషేధంలో భాగస్వామ్యమై విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ గారు కోరటమైనది. సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే నగరపాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 8181960909 కు కాల్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవాలని తెలిపారు
కార్యక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, జోనల్ కమిషనర్-1 సుధాకర్, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.