Breaking News

పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రభుత్వం పెద్ద పీట

-ఏపీ లో మొత్తం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో 40 శాతం పునరుత్పాదక ఇంధనానిదే
-భవిష్యత్లో ఇతర రాష్ట్రాలకూ పునరుత్పాదక ఇంధనం ఎగుమతి –ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్
-ఇంధన సామర్ధ్య రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం
-ఇంధన సామర్ధ్య లక్ష్యాలను సాధించాలంటే అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరం
-జాతీయ స్థాయిలో 2030 నాటికీ 150 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్(ఎంటీఓఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలని లక్ష్యం
-ఇంధన సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఇంధన భద్రత, సాధించడమేగాక రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మెరుగుదల
-రాష్ట్రంలో 30 భారీ పరిశ్రమల్లో పాట్ పథకం అమలు ద్వారా 0.818 ఎంటీఓఈ ఇంధనంన ఆదా, 2.464 మిలియన్ టన్ కార్బన్ ఉద్గారాల తగ్గుదల
-పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్ధ్య రంగాల్లో ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న కృషికి డీజీ బీఈఈ ప్రశంస
-రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీఎస్ఈసిఎం ప్రణాళికలు రూపొందించి అమలు చేయవలసిందిగా డీజీ బీఈఈ సూచన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్ర ప్రదేశ్ ముందు వరుసలో ఉందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 18.8 గిగా వాట్లు ఉండగా అందులో 40 శాతం (7. 5 గిగా వాట్లు) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తే అని తెలిపారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు కూడా పునరుత్పాదక ఇంధనాన్ని ఎగుమతి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇంధన సామర్యం , పునరుత్పాదక ఇంధన రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రసమగ్రాభివృద్ధి ,ఇంధన భద్రత ,పర్యావరణ సమతుల్యత సాదించవచ్చునని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ(బీఈఈ) రాష్ట్రానికి సూచించింది. దీనివల్ల ఇంధనం రంగం, పర్యావరణ పరంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పై పడే భారాన్ని తగ్గించడమేగాక 2030 నాటికి దేశంలో ఒక బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్య సాధనకి కూడా దోహద పడుతుందని బీఈఈ తెలిపింది.

అమెరికా లో జరిగిన గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ఏక్షన్ ఫోరమ్ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం, బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే , ఆన్లైన్ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ , ఏపీఎస్ఈసిఎం అధికారులతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగాన్ని పెద్ద ఎత్తున పోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రోజెక్టుల ఏర్పాటుతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు ప్రత్యేకంగా జీఓ విడుదల చేసినట్లు ఆయన తెలిపారు . దీని వల్ల భవిష్యత్లో కూడా 24 x 7 నాణ్యమైన విద్యుత్ సరఫరా , రాష్ట్రానికి ఇంధన భద్రత లభించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ప్రయోజనకరం అవుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంధన సామర్థ్యం , పునరుత్పాదక ఇంధనం పై ప్రత్యేక చొరవ చూపుతున్నారని విజయానంద్ తెలిపారు.

అనంతరం అభయ్ బాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ, ఇంధనం సామర్ధ్య రంగాలని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా స్టేట్ డేసిగ్నేటెడ్ ఏజెన్సీ ని ఏర్పాటు చేసిందని ప్రశంసించారు. దేశంలో పునరుత్పాదక ఇంధనం , ఇంధన సామర్ధ్య రంగాలను అభివృద్ధి చేసే లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రంగాల అభివృద్ధి వల్ల పర్యావరణం పై పడే కాలుష్య ప్రభావాన్ని పెద్ద ఎత్తున తగ్గించడంతో పాటు మరింత ఆర్థిక పురోగతి సాధించవచ్చునని పేర్కొన్నారు .

ప్రత్యేకించి ఇంధన సామర్ధ్యాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం వల్ల అభివృద్ధి లక్ష్యాలలో రాజీ పడకుండానే ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చునని , తద్వారా ఇంధన భద్రతను సాధించడమేగాక రాష్ట్ర ఆర్థికాభివృద్ధి , ఉపాధి కల్పనను మెరుగుపరుచుకోవచ్చునని పేర్కొన్నారు. అయితే ఇంధన సామర్ధ్య లక్ష్యాలను సాధించాలంటే అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంధన సామర్ధ్య రంగంలో చురుకుగా వ్యవహరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు మరింత క్రీయాశీలకమైన పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్, కేరళ రాష్ట్రాల తరహాలో అన్ని రాష్ట్రాలు ఇంధన సామర్ధ్య విభాగాలను ఏర్పాటు చేసి ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.

జాతీయ స్థాయిలో 2030 నాటికీ 150 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్(ఎంటీఓఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ 6. 68 ఎంటీఓఈ పొదుపు లక్ష్యాన్ని సాదించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. దీని పై ఏపీఎస్ఈసిఎం అధికారులు స్పందిస్తూ రాష్ట్రంలోని సుమారు 30 భారీ పరిశ్రమల్లో పాట్ పథకం అమలు చేయటం ద్వారా 0.818 ఎంటీఓఈ ఇంధనాన్ని ఆదా చేయడమే గాక 2.464 మిలియన్ టన్ కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగామని పేర్కొన్నారు. దీనిపై బీఈఈ డీజీ స్పందిస్తూ పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్ధ్య రంగాల్లో ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

పర్యావరణ పరిరక్షణ , ఇంధన సామర్థ్యం తదితర అంశాల పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్ కె సింగ్ , కేంద్ర ఇంధన శాఖ సెక్రటరీ అలోక్ కుమార్ పేర్కొన్నట్లు అభయ్ బాక్రే తెలిపారు . ఈ దృష్ట్యా రాష్ట్రాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీఎస్ఈసిఎం ప్రణాళికలు రూపొందించి అమలు చేయవలసిందిగా సూచించారు. ఇందులో విద్యార్థులను , రైతు సంఘాలు ,పరిశ్రమల సంఘాలు, తదితరులను భాగస్వాములుగా చేయాలన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *