Breaking News

ఎన్ ఆర్ ఐ గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద మహిళలకు తోపుడు బండ్లు పంపిణీ


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలోని నెహ్రూ బొమ్మ సెంటర్లో ఆదివారం ప్రవాసాంధ్రులు గొలగాని రవి కృష్ణ తండ్రి కీl l శే l l గొలగాని రామారావు వర్ధంతి సందర్భంగా ప్రవాసాంధ్రులు గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి తల్లిదండ్రుల పేరు మీద విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని వెనకబడిన వర్గాలకు చెందిన పేద మహిళలకు జీవనోపాధి నిమిత్తం ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ ఎక్కడో విదేశాల్లో ఉండి విజయవాడలోని అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ తన తల్లి దండ్రుల పేరు మీద వారి తండ్రి గారి వర్ధంతి సందర్భంగా పేదవారికి రెండు తోపుడు బళ్లను ఇవ్వటమే కాకుండా 200 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించరన్నారు. రవికృష్ణ కరోనా కష్టకాలంలో కూడా ఎంతో సేవలందించరన్నారు. ప్రైవేటు స్కూలులో పనిచేసే ఉపాధ్యాయులకు, సినిమా థియేటర్లో పనిచేసే సినీ కార్మికులకు అలాగే శానిటరీ, పోలీస్ సిబ్బందికి ఎంతోమందికి నిత్యావసర సరుకులు తో పాటు కూరగాయలు బట్టలు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం అన్నారు. పల్లా దుర్గమ్మ సీపీఐ మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ రవి కృష్ణ తన తల్లిదండ్రుల పేర్లను నిలబెట్టిన గొప్ప మనసున్న మనిషి అని అతను సేవా కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నాడని అతనికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. అలాగే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడికి ముఖ ద్వారా నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ నా చిన్ననాటి మిత్రుడు అయినటువంటి గొలగాని రవి కృష్ణ అనేక సేవా కార్యక్రమాలలో భాగంగా కరోనాలో ఆనందయ్య మందును విజయవాడకు తీసుకువచ్చిన ఘనత రవి కృష్ణదే అన్నారు. ఎంతో మంది పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారికి ఆర్థిక సాయం అందించడంలో ముందున్న వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భోగావల్లి శ్రీధర్, సితార సెంటర్ సోషల్ సర్వీస్ వర్కర్ రాము, బి సి నాయకులు నమ్మి అప్పారావు, పొట్నూరి చక్రధర్, కోళ్ల రజిని, ఒమ్మి రాము, కోళ్ల ప్రసాద్, దుక్కా వేణు, తోట కోటి, డోప్పా ప్రకాష్, పైలా ఆనంద్, డోప్పా పవన్, బొట్ట అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *