Breaking News

వైఎస్ఆర్ చేయూతతో మహిళల కుటుంబాల్లో వెలుగులు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “వైఎస్ఆర్ చేయూత” పథకం.. రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో మొగల్రాజపురం బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ స్కూల్ నందు జరిగిన తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7, 8 డివిజన్లకు చెందిన 964 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన 1,80,75000 రూపాయలను అక్కాచెల్లెమ్మల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసుగల బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.వైఎస్సార్‌ చేయూత’ పథకం మహిళలను ఆర్ధికంగా ఎంతో బలోపేతం చేయడంతో పాటు వారిలో కొండంత ఆత్మ విశ్వాసాన్ని నింపుతోందన్నారు. ప్రభుత్వం అందించే ఈ సాయం మొత్తాన్ని ప్రతి ఒక్కరూ.. సమర్థవంతంగా తమ వ్యాపారానికి పెట్టుబడిగా ఉపయోగించుకోవాలన్నారు. వారు ఏ రంగంలో వ్యాపారాన్ని రాణించాలనుకుంటున్నారో.. నిర్ణయించుకుని ముందుకుసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించనుందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుల, మత, పార్టీ భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, 60 సంవత్సరాలు నిండితే పెన్షన్ అంతేకాకుండా చేయూత కాపు నేస్తం, రైతు భరోసా, పేదలకు ఇళ్ల స్థలాలు ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఆమలు చేస్తున్నాడని ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు దొరకడం ఓ అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్,వైస్సార్సీపీ నాయకులు సంపత్, కుటుంబరావు, ధనరాజ్, రాజ్ కమల్, సుభాషిణి, సుజాత, క్లైవ్, ఉదయ్, మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *