Breaking News

411.89 ఎకరాల భూములకు నిషేధిత జాబితా నుంచి తొలగింపు…

రాజమహేంద్రవరం / దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త:
దేవరపల్లి మండలం పరిధిలో 22 ఏ నిషేధిత భూముల జాబితా లోని 342 రెవెన్యూ సర్వే నంబర్లలో  ఉన్న 411.89 ఎకరాల భూములకు నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నిషేధిత జాబితా 22 ఏ కింద ఉండడం వల్ల ఆయా భూముల యజమానులు సర్వే చేపట్టి తగిన న్యాయం చేయ్యాలని మే 23న   గోపాలపురం లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో  ఆర్జి ఇవ్వడం జరిగిందన్నారు. ఆ స్పందన అర్జిపై స్పందించి రెవెన్యూ, సర్వే అధికారులు సిబ్బంది ద్వారా క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి నిషేధిత జాబితా నుంచి ఆయా సర్వే నంబర్ల 22 ఏ కింద రానీ భూములను తొలగించి నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.

నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు:
342 ఆర్ ఎస్ నెంబర్ లలో ఉన్న  411.89  ఎకరాల భుమిని 22(ఏ) జాబితా నుంచి తొలగించడం ద్వారా  363 మందికి ప్రయోజనం కలుగుతుందని తెలియచేశారు. గ్రామాల వారీగా వివరాలు బండాపురం 84.53 ఎకరాల్లో178 మంది కి, చిన్నాయగూడెం 6.28  ఎకరాల్లో ఉన్న 41 మందికి,  దేవరపల్లి 223.34 ఎకరాల్లో ఉన్న 57 మందికి, దుద్దుకూరు లో 34.01 ఎకరాల్లో ఉన్న 82 మందికి, గౌరీపట్నం  47.91 ఎకరాలను,  కొండగూడెం 12.39 ఎకరాలను , లక్ష్మీపురం లో 3.05 ఎకరాలు,  పల్లంట్ల 0.38 ఎకరాల్లో ఉన్న 5 మందికి చెందిన భూములను రికార్డులను పూర్తి స్థాయి లో తనిఖీలు నిర్వహించి నిషేధిత  జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు.  సంబంధిత రెవెన్యూ పోర్టల్ లో కూడా ఆ వివరాలు నమోదు చేయడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *