ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజు గురువారం శ్రీకనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే బిక్షను అందించే అంశము అద్భుతము! సర్వ పుణ్యప్రదాయకము. లోకంలో జీవుల ఆకలి తీర్చటం కన్నా మిన్న ఏది లేదు. ఈ నిత్యాన్నధానేశ్వరి అలంకారంలోవున్న శ్రీదుర్గమ్మని దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు.
Tags indrakiladri
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …