-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర సుభిక్షంగా మారిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. న్యూ ఆర్.ఆర్.పేటలోని మసీద్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి.. ప్రజాప్రతినిధులు, అధికారులు 305 గడపలను సందర్శించారు. పథకాలు అమలవుతున్న తీరును నేరుగా ప్రజలను అడిగి ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పేదల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చల్లని పాలన ఇదేవిధంగా కొనసాగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు అవసరమైన ప్రతి విషయాన్ని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారం చేపట్టిన తర్వాత పథకాల ద్వారా వాటిని తీరుస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. విద్యా, వైద్య, గృహ నిర్మాణ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గ్రీవెన్స్ స్వీకరించారు. ప్రజల సౌకర్యార్థం స్థానికంగా రెండు బోరు పంపులను ఏర్పాటు చేయాలని వీఎంసీ సిబ్బందికి సూచించారు.
సచివాలయ పరిధిలో రూ. 4.54 కోట్ల సంక్షేమం
234 వ వార్డు సచివాలయ పరిధిలో మూడేళ్లలో రూ. 4.54 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 454 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్టన్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 516 మందికి రూ. 77.40 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 66 మందికి రూ. 3.20 లక్షలు., చేయూత ద్వారా 246 మందికి రూ. 46.12 లక్షలు., కాపునేస్తం ద్వారా 29 మందికి రూ. 4.35 లక్షలు., జగనన్న తోడు ద్వారా 8 మందికి రూ. 80 వేలు., వాహనమిత్ర ద్వారా 58 మందికి రూ. 5.80 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ నగదును సద్వినియోగపరచుకునేలా లబ్ధిదారులను చైతన్యపరచాలని అధికారులు, సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుది ఏడుపే ఏడుపు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష ప్రతిఒక్కరిలో నూతన ఉత్తేజాన్ని నింపిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ దృష్టికి వచ్చే సమస్య ఎటువంటిదైనా నూరు శాతం పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి స్పష్టంగా సూచించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలకు ఎప్పటికప్పుడు తక్షణ పరిష్కారం లభిస్తుండటంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయిందని.. దీంతో ఏడుపే ఏడుపు కార్యక్రమాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులకి ధైర్యం ఉంటే తమ హయాంలో చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే ప్రజల ముందుకు వచ్చి వివరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గత పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీని 254 ఎమ్మెల్యే స్థానాల నుంచి 23కు దిగజార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో కుప్పం సహా 175 స్థానాలలో వైసీపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన రెండు జాతీయ పార్టీలు మరలా ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి రాజారమేష్, 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి, డీఈ గురునాథం, నాయకులు చెన్నకేశవరెడ్డి, కాళ్ల ఆదినారాయణ, నెల్లి గోవింద్, చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నూతలపాటి శ్రీనివాసరావు, పఠాన్ నజీర్ ఖాన్, గుండె సుందర్ పాల్, ఉమ్మడి వెంకట్రావు, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News