Breaking News

జ‌గనన్న పాలనలో ప్రతి ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు

-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో ఇంటింటా సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ప్రాంత ప్రజలు ఆప్యాయంగా పలకరించారు, కర్పూర హారతులు పట్టారు. శాలువలతో ఘనంగా సత్కరించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,664 గృహాలలో, 410 ఇళ్లను మల్లాది విష్ణు సందర్శించి.. మూడేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి గడపకు అందించిన లబ్ధి గూర్చి బుక్ లెట్ల ద్వారా వివరించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి అమలు చేశామా..? లేదా..? అని అడిగిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. కనుకనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గ్రీవెన్స్ స్వీకరించారు. శానిటేషన్ సిబ్బంది రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా రెండు పూట్ల ఫాగింగ్, మందు పిచికారీ చేయాలన్నారు. ప్రతి ఇంటి వద్ద పుస్తకం ఏర్పాటు చేసి.. అందులో శానిటేషన్, మలేరియా సిబ్బంది రోజూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలతో స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. మరోవైపు సచివాలయ పరిధిలో కేటాయించే రూ. 20 లక్షల నిధులతో ప్రజలందరూ సంతృప్తి చెందేలా అభివృద్ధి పనులు చేపడతామని తెలియజేశారు.

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాలను నివారించవచ్చని మల్లాది విష్ణు అన్నారు. పోషకాహార మాసోతవ్సాలను పురస్కరించుకుని చివరి రోజు పర్యటనలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, అంగన్‌వాడీ కేంద్రంలో అందించే సేవల గురించి విస్తృత అవగాహన కల్పించారు. మహిళలలో 65 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని.. 51 శాతం మంది గర్భిణీలలో ప్రధానంగా ఈ సమస్య ఉందని తెలిపారు. ఏఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే పౌష్టికాహారం లభిస్తుందో, ప్రజలకు అవగాహనా కలిగించడంతోపాటు.. పౌష్టికాహార లోపంతో కలిగే నష్టాలను కూడా తెలియపరచడమే “పోషకాహార మాసోత్సవాల” ప్రధాన ఉద్దేశమన్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు ముర్రుపాలు తాగించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడించారు. ప్రతి నెలా పిల్లల బరువులు, ఎత్తులు పరిశీలించి వారి పోషణ స్థితిని గుర్తించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాక.. పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా ఆరోగ్య భారతం సాధ్యమవుతుందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్ సీపీని ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదు
సామాన్య, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు పేదలు, మహిళల ఆర్థికాభివృద్ధి గూర్చి ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో బడ్జెట్ భారీగా ఉన్నా.. ఆ నిధులన్నీ టీడీపీ నేతల జేబుల్లోకి, జన్మభూమి కమిటీ సభ్యుల ఇళ్లకు చేరాయని ఆరోపించారు. భర్తతో కలిసి ఉన్న మహిళలకు కూడా ఒంటరి మహిళ పెన్షన్లు మంజూరు చేయించి జన్మభూమి కమిటీలు చేసిన అక్రమాలు అంతా ఇంతా కాదన్నారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అత్యంత పారదర్శకంగా, శాచ్యురేషన్ పద్ధతిలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండ‌టం ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల అదృష్టమ‌ని వెల్లడించారు. అటువంటి వ్యక్తిని ఢీకొని నిలబడే సత్తా.. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి రాజారమేష్, 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ గురునాథం, నాయకులు చెన్నకేశవరెడ్డి, కాళ్ల ఆదినారాయణ, నెల్లి గోవింద్, చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నూతలపాటి శ్రీనివాసరావు, పఠాన్ నజీర్ ఖాన్, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *