విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి లో అగ్రగమిగా నిలిపి సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో మిగతా ముఖ్యమంత్రిలకు ఆదర్శంగా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ మూడేళ్ళలో ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 98 శాతం పైగా హామీలను అమలు చేసిన ఘనత జగన్ దే అని, మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు కొండంత భరోసా ఇస్తున్నారు అని తెలిపారు. తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టాలను స్వయంగా చూసి రూపొందించిన మెనిఫెస్టో ని పారదర్శకంగా అమలు చేయడమే లక్ష్యంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థ లను ప్రవేశపెట్టి గడప వద్దకే అర్హతే ప్రామాణికంగా సంక్షేమ లబ్ది అందజేస్తున్నారని అన్నారు.గతంలో పెన్షన్ తీసుకోవాలంటే అవ్వతాతలు కార్యాలయాల చుట్టూ తిరిగి ఆలసిపోయావరు అని కానీ నేడు 1వ తేదీ పొద్దున్నే ఇంటికే వలంటీర్ లు తీసుకొచ్చి ఇస్తున్నారు అని అన్నారు.అందుకే మా పర్యటనలో ప్రతి ఇంటికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మేము జెండా మోసి కష్టపడిన సరే నాడు మాకు ఎలాంటి పధకాలు రాలేదు కానీ నేడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మా ఇంట్లో ముసలివాళ్ళకి పెన్షన్, అమ్మఒడి,చేయూత లాంటి పధకాలు వస్తున్నాయి అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కాకపోతే మా ఈ పర్యటన లో అర్జీలు అందిస్తే సంబంధిత సచివాలయ సిబ్బంది తక్షణమే మంజూరు అయ్యేలా తగు చర్యలు తీసుకొంటారని భరోసా ఇచ్చారు. ఒకవైపు జనరంజక పరిపాలన అందిస్తూ జగన్ ప్రజల మనసులో కొలువై ఉంటే,మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చుస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రోజు పేపర్లో పడాలి, తమ అధినేత దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అని షో రాజకీయాలు, డ్రామాలు ఆడుతూ తన అనుకూల సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికే పరిమితం అయ్యారని,గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండటం లేదని ఎద్దేవా చేశారు.అందుకే వైస్సార్సీపీ నాయకులు వస్తుంటే ప్రజలు మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లికి అండగా ప్రభుత్వం పెళ్లి కానుక, షాధి తోఫాలు పధకాలు అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా 3వ డివిజన్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళలు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేదవారి సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైస్సార్సీపీ అని, ఎస్సి,ఎస్టీ,బీసీ,ముస్లిం మైనారిటీల పేదలకు వారింటి ఆడపిల్లల పెళ్ళిలకు ఒక అన్నగా జగన్ అండగా నిలబడుతూ ఆర్థిక సహాయం చేయడం శుభపరిణామం అని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ్,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు,వైస్సార్సీపీ నాయకులు ఏలూరి శివాజీ,పూర్ణచంద్ర రావు,దాడి సుబ్బారావు,సజ్జా కృష్ణ,డేవిడ్ రాజు,వెంకట స్వామి, ఆనంద్,భీమిశెట్టి శ్రీనివాస్ రావు,రామకృష్ణ,సీతారామయ్య,కోటేశ్వర రావు,కొండయ్య దితరులు పాల్గొన్నారు.