ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరప రోజు శనివారం మహాలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ మంత్రికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాన్ని మంత్రి జోగి రమేష్ కు అందజేశారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ అరగంట నుండి 45 నిమిషాలలోపే భక్తులకు అమ్మవారి దర్శనం జరిగేలా చేసిన ఏర్పాట్లు ఎంతో సంతోషదాయకమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రైతుసంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సభ్యులను చేసుకుని ఆనందంగా ఉంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకొన్నానని, అందరికీ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రసాదించాలని మంత్రి జోగి రమేష్ అన్నారు.
Tags indrakiladri
Check Also
వైద్య, ఆరోగ్య శాఖలో ఏడెనిమిది వేల ఖాళీల భర్తీకి మంత్రి ఆదేశం
-ప్రజలకు మెరుగైన సేవలకు డాక్టర్లు, పేరా మెడికల్ సిబ్బంది నియామకం అవసరమన్న మంత్రి -మంజూరైన పోస్టులు, ఖాళీలపై మంత్రి సత్యకుమార్ …