విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న కాన్సులెట్ జనరల్ బృందానికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. రాజ్ భవన్ దర్బార్ హాలులో దాదాపు అరగంటకు పైగా ఈ మర్యాద పూర్వక భేటీ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలు , రాష్ట్ర సాంఘిక, సామాజిక , రాజకీయ పరిస్ధితులను వివరించారు. పర్యాటక రంగ పరంగా ఆంధ్రప్రదేశ్ పలు ఆకర్షణీయ ప్రదేశాలకు వేదికగా ఉందని , వాటిని సందర్శించాలని సూచించారు. అమరావతిలోని ఉండవల్లి గృహలను, వివిధ దేవాలయాలను గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం గురించి గవర్నర్ వివరించారు. భారతీయ విధ్యార్దులు, యువత విద్యార్జన, ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేసిందని ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ గవర్నర్ కు తెలిపారు, వీరి భేటీ నేపధ్యంలో అమెరికాను సందర్శించ వలసిందిగా జెన్నీఫర్ గవర్నర్ ను ఆహ్వానించారు. సమావేశంలో కాన్సులేట్ రాజకీయ, ఆర్ధిక విభాగం అధిపతి సీన్ రూత్ , రాజకీయ , ఆర్ధిక నిపుణుడు శ్రీమల్లి, ఉప కాన్సుల్ జనరల్ మార్షల్ విలియమ్స్, ప్రజా వ్యవహారాల అధికారి డేవిడ్ మేయర్ , రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభానికి హాజరైన రాష్ట్ర …