విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్ సర్కిల్‌లో ధర్నాచౌక్ నందు పదకొండవ రోజు చేస్తున్న సత్యాగ్రహ దీక్షలు, నిరవదిక దీక్షలకు సంఫీుభావం తెలుపుతూ శాసనమండలి సభ్యులు బి.టి.నాయుడు, టీడీపీ వాల్మీకి సాదికారత కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ పూల నాగరాజు, మాజీ అహుడా ఛైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ, డాక్టర్ పార్థసారధి తదితరులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం, వాల్మీకి జెఎసి ఆధ్వర్యంలో బోయ ఈశ్వరయ్య సారధ్యంలో అత్యంత ప్రజాదరణతో సత్యాగ్రహ దీక్షలు, నిరవదిక దీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకొని ఎన్నికలు అయిపోయాక పట్టించుకోవడంలేదని సంబందిత వ్యవస్థలను వెంటనే స్పందించి వాల్మీకుల ప్రధాన సమస్యను పరిష్కరించాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. వాల్మీకులు కడుపేదలని విద్యాపరంగా, ఉద్యోగపరంగా పూర్తిగా వెనుకబడిన ఈ జాతిని ఎస్టీ జాబితాలోనికి పునరుద్దరించి తక్షణ చర్యలు గైకొనాల డిమాండ్ చేశారు. తమకు లభించిన పదవలులు కేవలం బోయలుగా పుట్టడం వల్లే లభించాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి తక్షణ నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే తమ ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లా, కడప, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వందల సంక్యలో పాల్గొని తమ సంఫీుభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు ఈశ్వరయ్య, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్, బి.ప్రతాప్‌నాయుడు, పి.సాయిప్రవీణ్, ప్రొఫెసర్ యం.జగదీశ్వరరావు, బొప్ప వరపు భానుప్రకాష్, వి.సుంకరత్నమ్మ, కె.బ్రహ్మయ్య, డి.ఇ.రమేష్‌కుమార్, అంకె లక్ష్మన్న, వాల్మీకి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News