-ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వం చాటుకున్న జిల్లా అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నా అనే నాధుడు లేని అనాధ అయిన పీతల పార్వతికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు జిల్లా అధిరాలు ఆసరా కల్పించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మానవ హక్కుల కమీషన్ అభినందనలు అందుకుంటున్నారు. విజయవాడ రైవస్ కాలువ ఫుట్‌పాత్‌పై ముగ్గురు మనవరాలతో జీవనం సాగిస్తున్న పీతల పార్వతి కుటుంబాన్ని ఆదుకోవాలని ‘‘ఫుట్ పాతే ఇల్లు` అమ్మమే అమ్మనాన్న’’ అంటూ వార్తకదనం రావాడంతో స్పందచిన జిల్లా కలెక్టర్ పీతల పార్వతి వద్దకు జిల్లా అధికారులను పంపించి విచారించారు. కూతురు అల్లుడు అనోరోగ్యంతో మరణించాడంతో ముగ్గురు మనవరాళ్ళతో ఫుట్‌పాత్ పై జీవిస్తునానని ఉండడానికి ఇళ్లు, తినడానికి తిండి లేక అలమటిసునామని పార్వతి అధికారుకు తెలిపింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పార్వతి మనవరాలు కట్టా లావణ్య ను గన్నవరం జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతి, కట్టా రాధను శ్రీ మలికార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 1వ తరగతిలో, కట్టా భవానిని అదే స్కూల్‌లో ఎల్‌కెజి లో చేర్పించడంతో మంచి విద్యా బుద్దులు నేర్చుకుంటున్నారు.
అనాధగా మిగిలిన పీతల పార్వతికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర పౌర సరఫరాల అధికారులతో సంప్రదించి రేషన్ (రైస్) కార్డును మంజూరు చేయడంతోపాటు బ్యాంకు ఖాతాను ప్రారంభించి వైఎస్సార్ చేయూత ద్వారా 18,750 జమ చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ చొరవతో రేషన్ బియ్యం అందుకోవడంతోపాటు వైస్సార్ చేయుత సొమ్ముతో బ్యాంకు ఖాతాలలో జమ కావడంతో పార్వతి ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మనవరాలకు ప్రభుత్వం ద్వారా విద్యా సహాయం కింద అమ్మఓడి పథకం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సహకారంతో పాటు జిల్లా అధికారులైన డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె. సునీత, డిఎస్‌వో పి.కోమలిపద్మ, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, మార్క్‌ఫెడ్ డియం మల్లిక, బిసి వెల్ఫెర్ ఆఫీసర్ లక్ష్మి దుర్గలు ఒక్కొక్కరూ 3 వేల రూపాయలు చొప్పున 15 వేల రూపాయలను పీతల పార్వతికి ఆర్థిక సహాయం అందించి మానవతను చాటుకున్నారు. సోమవారం నిర్వహించిన స్పందన సమావేశంలో పార్వతి మనవరాల్లు ఈ రోజు పాఠశాలకు వెళుతున్న ఫోటోను మొబైల్ ద్వారా స్పందన అధికారులకు జిల్లా కలెక్టర్ చూపించారు. అనంతరం రేషన్ కార్డును బ్యాంకు అకౌంట్ పాస్ బుక్‌ను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్‌అజయ్ ఆర్‌డివో కె. మోహన్‌కుమార్‌లు తహాశీల్థార్ దుర్గాప్రసాద్‌అందజేశారు.