-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 30.58 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 25వ డివిజన్లో చాపరాల వారి వీధి నుండి లాల్ బహదూర్ శాస్త్రి వీధి వరకు., ఐనవోలు వారి వీధి నుండి లాల్ బహదూర్ శాస్త్రి వీధి వరకు రూ.30.58 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ల నిర్వహణను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. రహదారులకై తీసుకొచ్చిన నిధులను సైతం గత పాలకులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. దీంతో రోడ్ల నిర్వహణ అధ్వానంగా తయారైందని.. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రోడ్ల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం మూడున్నరేళ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.100 కోట్ల నిధులతో రహదారుల పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే పనులు వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకసారి నిర్మించిన రహదారులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల వరకు ఉండేలా నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఒకప్పుడు రహదారులు ఏలా ఉండేవి..? ప్రస్తుతం అభివృద్ధి చేసిన రోడ్లు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను ప్రజలకు తెలియజెప్పేలా నాడు–నేడు ఫొటో ప్రదర్శనను ఇటీవల సర్కిల్ – 2 కార్యాలయంలో నిర్వహించుకున్నట్లు తెలిపారు. శంకుస్థాపన చేసిన పనులు నెల రోజుల్లోగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, వైసీపీ కార్పొరేటర్లు బంకా శకుంతల భాస్కర్, కొంగితల లక్ష్మీపతి, నాయకులు పిల్లి కృష్ణవేణి, మానం వెంగయ్య, గంగయ్య, రవీంద్ర, నజీర్, అలీ, వి.బి.ఆచారి, మారుతి, కోలంటి రవి, బంకా బాబి, బత్తుల ఆదయ్య, తదితరులు పాల్గొన్నారు.