గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల జడ్పీటీసీగా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన మూరకొండ ఏడుకొండలు, కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉప్పెర్ల ఆంజనేయులు శనివారం గొల్లపూడిలోని కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరినీ దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, కంచికచర్ల మండలంతో పాటు ఆయా గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని దేవినేని ఉమా సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
అత్యధిక మెజారిటీతో గెలుపొందిన జడ్పీటీసీ మూరకొండ ఏడుకొండలు, ఏకగ్రీవ సర్పంచ్ ఉప్పెర్ల ఆంజనేయులుకు దేవినేని ఉమా అభినందనలు
