డిప్యూటీ మేయర్ చెన్నుపాటి కాంతిశ్రీకి దేవినేని ఉమా అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి చెన్నుపాటి కాంతిశ్రీకి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపాటి గాంధీని కూడా దేవినేని ఉమా అభినందించారు. నూతనంగా డిప్యూటీ మేయర్ బాధ్యతలు చేపట్టిన కాంతిశ్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయవాడ నగర అభివృద్ధికి ఆమె కృషి చేయాలని ఆకాంక్షించారు.
నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన పౌర సదుపాయాలు కల్పించే దిశగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు.