విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని టాగూర్ గ్రంథాలయాన్ని ఈరోజు లిటిల్ మిలీనియం విద్యాసంస్థకు చెందిన ప్లే స్కూల్ విద్యార్థులు సందర్శించారు. చిన్ననాటి నుంచే పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించి, మంచి పఠన అలవాట్లను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రమాదేవి విద్యార్థులకు గ్రంథాలయంలోని చిన్న చిన్న కథల పుస్తకాలను పరిచయం చేసి, చిన్ననాటి నుంచే ఈ విధంగా చేయటం వల్ల విజ్ఞానం, మానసిక వికాసం కలుగుతుందని, చిన్నతనం నుంచే పుస్తకాలను చదవడం అలవాటు చేయటం మంచి అలవాటని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది వై ధనలక్ష్మి మరియు టీచర్స్ గౌసియా, సుప్రియా, శ్రీలక్ష్మి, సత్య పాల్గొన్నారు.
లిటిల్ మిలీనియం ప్లే స్కూలో కానూరు విద్యార్థులు టాగూర్ గ్రంథాలయ సందర్శన
