విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ ఉద్యోగులు తాము నిర్వర్తిస్తున్న విధులతో పాటు క్రీడలలో ప్రతిభ కనపరచడం హర్షనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ఇటీవల గుంటూరు నాగార్జున విశ్వ విద్యాలయంలో ఈనెల 11 నుండి 13 తేది వరకు జరిగిన 6వ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల క్రీడలలో ఎన్‌టిఆర్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి 10 క్రీడా విభాగాలలో 35 పతకాలను సాధించిన క్రీడాకారులను బుధవారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ డిల్లీరావు ఘనంగా సన్మానించారు. వాలీబాల్, టగ్‌ఆఫ్ వార్, టెన్నిక్వోడో,క్యారమ్స్, బ్యాట్‌మెంటెన్, షార్ట్‌పుట్, డిస్క్‌త్రో పాటు వివిధ పోటీలలో పతకాలు సాధించడం పట్ల అభినందిస్తూ తోటి ఉద్యోగులు స్పూర్తిగా తీసుకోవాలన్నారు. పతకాలు పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలోను ఉత్తమ ప్రతిభ కనపర్చాలని కలెక్టర్ డిల్లీరావు ఆకాంక్షించారు. సన్మాన కార్యక్రమంలో ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి కె. నాగభూషణం, కలెక్టరెట్ అసోసియేషన్ అధ్యక్షులు యు. ఆనంద్, జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాస్, కార్యదర్శి బి. రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యం మాధురి, కృష్ణాజిల్లా అధ్యక్షులు పి. సతీష్ ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …