-ఐజి ఎస్. హరికృష్ణ,, రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయకర్త
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా రెండవ విడత (ఫేజ్–II) ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయకర్త ఐజి ఎస్. హరికృష్ణ, తెలిపారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.
పోలీసు బందోబస్తు వివరాలు
* మొత్తం పోలింగ్ స్టేషన్ లొకేషన్లు (PSLs): 9,572
* మొత్తం పోలింగ్ స్టేషన్ (PSSs): 40,569
మోహరించనున్న పోలీసు బలగాల వివరాలు…
* హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు: 1,840 (9,048 మంది సిబ్బంది)
* సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు: 2,043 (8,164 మంది సిబ్బంది)
* సాధారణ పోలింగ్ కేంద్రాలు: 5,689
ఇతర బందోబస్తు ఏర్పాట్లు…
* రూట్ మొబైల్స్: 1,810 (3,620 మంది సిబ్బంది)
* స్ట్రైకింగ్ / స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్: 737 (3,672 మంది సిబ్బంది)
* చెక్ పోస్టులు / ఎస్ఎస్టీ: 278 (1,643 మంది సిబ్బంది)
* ROPS: 113
* ఇతర విభాగాలకు చెందిన యూనిఫాం సిబ్బంది: 864
* ఏపీఎస్పీ బలగాలు: 94 ప్లటూన్లు (1,974 మంది సిబ్బంది)
ర్యాంకుల వారీగా అందుబాటులో ఉన్న పోలీసు బలగాలు
* ఎస్పి లు -29
• అడిషనల్ ఎస్పి లు- 48
* డిఎస్పి లు -140
* సీఐలు / ఆర్ఐలు: 721
* ఎస్ఐలు / ఆర్ఎస్ఐలు: 1507
* ఏఎస్ఐలు / ఏఆర్ఎస్ఐలు: 2911
* సివిల్ హెడ్ కానిస్టేబుళ్లు / ఏఆర్ హెచ్సీలు: 5225
* సివిల్ కానిస్టేబుళ్లు / ఏఆర్ పీసీలు: 17076
* హోమ్ గార్డులు – 5990
మొత్తం అందుబాటులో ఉన్న పోలీసు బలగాలు: 33,647 మంది.
ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఐజి ఎస్. హరికృష్ణ స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, నిరంతర పెట్రోలింగ్, రూట్ మొబైల్ బృందాలు, స్ట్రైకింగ్ ఫోర్సెస్ ద్వారా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
