విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధిత ఆర్జీదారులు, అధికారులతో శనివారం కలెక్టర్ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ పునరావృతమవుతున్న (రీఒపెన్) స్పందన ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. స్పందన ఆర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పునరావృతం కాకుండా ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్) 6 ఆర్జీలకు సంబంధించి సమస్యలను ఆర్జీదారులు, అధికారులతో ముఖాముఖీ ద్వారా పరిష్కారం చూపారు.ఏ కొండూరు మండలం కోడురుకు చెందిన వై నాగేంద్రమ్మ, వై నర్శమ్మ, విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడుకు చెందిన ఫజిల్ రహెమాన్ ఖాన్, వత్సవాయి మండలం వేెమవరం గ్రామానికి చెందిన యం వెంకట రమ, విజయవాడ రూరల్ గొల్లపూడికి చెందిన పి. జీవన్ కుమార్, విజయవాడ మొగల్రాజ్పురంకు చెందిన వి. అంజలి దేవిలకు సంబంధించిన రెవెన్యూపరమైన సమస్యలను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు గూగుల్ కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …