-తూర్పు నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై సమీక్ష అధికారులకు పలు సూచనలు,
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,
-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,
-తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు 2,3,4,5,6 మరియు 7 డివిజన్లకు సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాల పై మరియు పెండింగ్ లో ఉన్న వర్క్స్ మరియు కొత్త ప్రాజెక్ట్స్, సచివాలయం వ్యవస్థ పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంలో గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా క్షేత్ర స్థాయిలో డివిజన్ నందు పర్యటించిన సందర్బంలో ప్రధానంగా రోడ్లు, డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, కొండ ప్రాంతాలలో మెట్ల మార్గం వంటి పలు ప్రధాన సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకురావటం జరిగిందని వివరిస్తూ, నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులకు సత్వరమే పరిష్కరించునట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మల కుమారి, భీమిశెట్టి ప్రవలిక, కలాపాల అంబేద్కర్, వియ్యపు అమర్ నాథ్, మెరకనపల్లి మాధురి మరియు చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, జోనల్ కమిషనర్ -3 డా. ఏ.రవిచంద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు వి.చంద్ర శేఖర్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాస్, మరియు ఇతర విభాగముల అధికారులు పాల్గొన్నారు.