-బెంజి సర్కిల్ నుండి రామవరప్పాడు రింగ్ వరకు గల జాతీయ రహదారి పరిశీలన…
-అధికారులకు పలు ఆదేశాలు – కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో వారధి నుండి రామవరప్పాడు రింగ్ వరకు గల జాతీయ రహదారి తదితర ప్రాంతాలలో పర్యటించి వాల్ పెయింటింగ్స్, గ్రీనరీ అభివృద్ధిపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. బెంజి సర్కిల్ జంక్షన్ లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువన ఏర్పాటు చేసిన కుండీల మధ్యన గ్యాప్ ను తగ్గించి ఖాళీగా ఉన్న కుండీలలో మొక్కలను నాటలని, గ్రీనరి అభివృద్ధి పరచుటతో పాటుగా జంక్షన్ నందు పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించే విధంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉద్యానవన అధికారులకు సూచించారు. అదే విధంగా రమేష్ హాస్పిటల్ దగ్గర ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువన వేస్తున్న వాల్ పెయింటింగ్స్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. పెయింటింగ్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు వి.చంద్ర శేఖర్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాస్, మరియు ఇతర అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News