విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య రంగంలో ఎంతో విశిష్ఠ సేవలు అందించిన మణిపాల్ హాస్పిటల్ ఆరోగ్యానికి సంబంధించిన మరో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. డిసెంబర్ 11 వ తేదీన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో “మణిపాల్ గుడ్ హెల్త్ రన్ – 5కె&10కె” పేరుతో దీనిని బీఆర్డీఎస్ రోడ్, గుణదల దగ్గర , విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ రోజు “మణిపాల్ గుడ్ హెల్త్ రన్” కు సంబంధించిన పోస్టర్ ను డి.జి.పి కె . వి . రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి, ఇతర డాక్టర్ల బృందం పాల్గొన్నారు. గతేడాది కూడా మణిపాల్ హాస్పిటల్ హెల్త్ రన్ ను నిర్వహించింది. గతంలో వచ్చిన మంచి ఆదరణతో రెట్టింపు ఉత్సహాంతో సంస్థ రెండో సారి (సెకండ్ ఎడిషన్) ఈ రన్ ను నిర్వహిస్తుంది. ఈ రన్ లో అమరావతి రన్నర్స్ తో పాటు అనేక వాకర్స్ క్లబ్ లు పాల్గొనడం ఎంతో ఆనందంగా వుంది.రన్ లో పాల్గొనే వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు.
ఈ సందర్భంగా డి.జి.పి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి గారు “మణిపాల్ గుడ్ హెల్త్ రన్”పై మాట్లాడారు. “మణిపాల్ హాస్పిటల్ చేపట్టిన ఈ గుడ్ హెల్త్ రన్ కార్యక్రమాన్ని నిజంగా అభినందించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలాంటి ఆరోగ్యంపై ఇలా అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన వీరిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని కోరుతున్నాను.” అని అన్నారు.
మణిపాల్ గుడ్ హెల్త్ రన్ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడారు. “విజయవాడ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కోసం 5కె & 10కె రన్ నిర్వహించడం నాకు చాలా సంతోషంగా వుంది. అత్యవసర సమయాల్లో చేయవలసిన చికిత్సలు & విధులు , దానితో పాటుగా అవయవ దానముపై అవగహన కార్యక్రమాన్ని అందిచనున్నారు. ఈ రన్ ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్ గా ఉండటం ఎంతో ముఖ్యమో తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశ్యం. ప్రతీ ఒక్కరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం ఉండడం ఈ కాలంలో ఎంతో ముఖ్యం. ఇందుకుగానూ ఈ రన్ మరింత దోహదపడుతుంది. ప్రతీ ఒక్కరూ కూడా ఉదయం, సాయంత్రం వేళ ఖాళీ సమయాల్లో రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేయాలని సూచించారు. ఈ రన్ లో 16 ఏళ్లకు పైబడిన వారు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు , రన్నర్స్, ఫిట్నెస్ సెంటర్స్, వాకింగ్ క్లబ్లు, ఇతరులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను.” అని అన్నారు. ఈ రన్ లో విజేతలుగా నిలిచిన వారికి కార్యక్రమములో ప్రముఖలుతో బహుమతి ప్రదానం చేస్తారు. రన్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి : 9618558989 / 7569304232 & https://www.ifinish.in/event_details/Manipal_Run