విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ ఆదేశాల ప్రకారము ఈరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంపు జరిగినది, సదర్ మెడికల్ క్యాంపును ఆంధ్ర హాస్పటల్ వారు ఉచితంగా వైద్య సేవలు అందించారు. సదర్ క్యాంపును చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి ప్రారంభించినారు సుమారుగా 200 మంది పైగా పారిశుధ్య కార్మికులు సదరు వైద్య సేవలను ఉచితంగా పొందినారు ముఖ్యంగా కార్మికులకు బిపి, షుగర్, గుండె పరీక్షలు, మరియు గైనిక్ విభాగము సంభంధించిన పరీక్షలు చేయించుట జరిగినది. ఈ క్యాంపును హెల్త్ విభాగము AMOH, శానిటరీ సూపర్ వెజర్లు,మరియు శానిటరీ ఇన్స్ పెక్టర్లు. పర్యవేక్షించుట జరిగినది.
Prajavartha Online Telugu News