Breaking News

ఎయిడ్స్‌ వ్యాధి అరికట్టేందుకు కండోమ్స్‌ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలి…

-ఎయిడ్స్‌ బాధితులకు సంఫీుభావం తెలిపి మనో ధైర్యాన్ని నిలుపుద్దాం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిడ్స్‌ వ్యాధిని సమూలంగా రూపు మాపేందుకు కండోమ్స్‌ వాడకం ఒకటే మార్గమని బాధితులకు అవసరమైన పౌష్టికాహారం చికిత్సను అందించడంతో పాటు మనో ధైర్యాన్ని నింపి వ్యాధి నుండి ఉపసమనం పొందేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా గురువారం బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని వాసవ్య మహిళా మండలిలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులైన చిన్నారులతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధిని అరికట్టేందుక ప్రతీ ఒక్కరిలో అవగాహన కల్పించి కండోమ్స్‌ వాడకంపై చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కండోమ్స్‌ వాడకం వలన ఎయిడ్స్‌ వ్యాధి బాధితుల సంఖ్య గననీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు. షాపింగ్‌ మాల్స్‌, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, వంటి రద్దీ ప్రాంతాలలో కండోమ్స్‌ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగ నిపుణులు వైద్యకృషి ఫలితంగా కొన్ని మందులు అందుబాటులోకి రావడంలో ఎయిడ్స్‌ నియంత్రణ జరిగి రోగులు సాధారణ జీవితాన్ని గడిపేలా వీలుకలిగిందన్నారు. మానవ నైజాన్ని మార్చుకుని క్షణికానందంతో అసాంఫీుక పద్దతులకు దూరంగా వుండాలన్నారు. తెలియని వ్యక్తులతో లైంగిక కార్యకలపాలకు పాల్పడకూడదన్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పిదాల వలన వారి నుండి అభంశుభం తెలియని చిన్నారులు వ్యాధిన పడడం బాధకరమన్నారు. హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పట్ల సంఫీుభావం తెలిపి వారికి పోష్టికాహారం మందులను అందించి జీవన ప్రమాణాలను పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. వాసవ్య మహిళా మండలి హెచ్‌ఐవి వ్యాధిభారిన పడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు, పోష్టికాహారం అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించి ఆదుకోవడం అభినందనీయమన్నారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే స్వచ్చంద సంస్థలకు ప్రభుత్వ పరమైన సహయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ చైర్మన్‌ డా. జి సమరం, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డా. బి కీర్తి, కార్యదర్శి జి. రష్మి, మెడికల్‌ డైరెక్టర్‌ డా.పి. దీక్ష, ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్థులైన చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *