-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విజయవాడ పర్యటనకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తునట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్ జవహర్ రెడ్డికి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్ల పై కృష్ణా, ఎన్‌టిఆర్ జిల్లా, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లతో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్ జవహర్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, సబ్ కలెక్టర్ అదితి సింగ్‌లు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈనెల 4వ తేది ఆదివారం ఉదయం 8 గంటలకు డిల్లీ నుండి బయలు దేరి ఉదయం 10:15 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అక్కడి నుండి నేరుగా తాడిగడప పురపాలక సంఘ పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం రాజ్ భవనకు చేరుకుని, రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ మాననీయ భిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చే విందులో పాల్గొంటారన్నారు. తదుపరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారన్నారు. రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పాల్గొనే కార్యక్రమాలపై రాజ్‌భవన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్ జవహర్ రెడ్డికి వివరించారు.
Prajavartha Online Telugu News