Breaking News

ఖచ్చితమైన తుది ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం…

-18 సంవత్సరాల వయస్సు నిండిన యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టి….
-డిసెంబర్‌ మాసాంతానికి తప్పులు లేని డేటాతో నూరు శాతం ఓటర్ల జాబితా సిద్దం…
-సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమీషనర్‌కు వివరించిన జిల్లా కలెక్టర్‌.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో ముసాయిదా ఓటర్ల జాబితాలో భాగంగా గురువారం సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమీషనర్‌ నితీష్‌ కుమార్‌ వ్యాస్‌ పార్మం`6, 7, 8, ఓటర్‌ డేటాతో ఆధార్‌ అనుసంధానం, యువ ఓటర్ల నమోదు తదితర అంశాలపై గురువారం డిల్లీ నుండి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ నవంబర్‌ 9వ తేదిన ప్రకటించిన ప్రత్యేక ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని వీటిలో భాగంగా జిల్లాలో 14,789 ఫార్మం `6,7,8, ధరఖాస్తులకు సంబంధించి అభ్యంతరాలు రాగా వీటిలో 367 తిరస్కరించగా,1,328 అమోధించడం జరిగిందని, ఇంకనూ మిగిలిన 13,094 ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా ప్రకటించే నాటికి జిల్లాలో మొత్తం 16,47,571 మంది ఓటర్లు ఉండగా వీరిలో 8,11,573 మంది పురుష, 8,35,850 మహిళ, 148 ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారన్నారు. జనాభా అధారంగా 18 నుండి 19 వయస్సు నిండిన యువ ఓటర్ల నమోదు, ఎలక్ట్రోల్‌ పాపులేషన్‌ (ఇపిరేషియో), జండర్‌ రేషియోను ఎన్నికల నిబంధనల మేరకు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువ ఓటర్ల నమోదు పై ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలో విద్యార్థులకు అవగాహన, ప్రిన్సిపాల్‌లతో సమవేశం నిర్వహించడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధానం 70 శాతం పూర్తి చేశామన్నారు. నగర పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలలో అనుసంధానం ప్రక్రియ తక్కువ గా జరుగుతుందని, నగరంలో ఇతర ప్రాంతాల నుండి వలస రావడం, వెళ్లడం వంటి తదితర కారణాలు ఉంటున్నాయని వీటిపై బుత్‌ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి డోర్‌ టూ డోర్‌ వెళ్లడం ద్వారా ఓటర్‌ డేటాకు ఆధార్‌ డేటా అనుసంధానం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ డిల్లీరావు సీనియర్‌ డిప్యూటి కమీషనర్‌ నితీష్‌ కుమార్‌ వ్యాస్‌కు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *