విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఏలూరు రోడ్డు, రామ మందిరం స్ట్రీట్, గవర్నర్ పేట లో న్యూ కాంటినెంటల్ పార్క్ హోటల్ మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు చేతులమీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ కాంత్ మాట్లాడుతూ పెరుగుతున్న విజయవాడ నగరానికి అత్యాధునిక అయిన రూములు, మినీ కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాలు ఏర్పాటు చేశామని భోజనం ప్రియులకుమా హోటల్ నందు బిర్యాని ప్రత్యేకత అని అన్నారు. తదనానంతరం హోటల్ నిర్వాహకులు ఆంధ్ర ప్రదేశ్ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిలవాయి విజయ్ కుమార్ మాట్లాడుతూ మా కాంటినెంటల్‌పార్క్ హోటల్ నందు అత్యాధునిక సదుపాయాలతో త్రీ స్టార్ హోటల్ సదుపాయాలతో వచ్చే కస్టమర్లకు అతి తక్కువ ధరలతో స్టాండర్డ్ రూమ్స్, ప్రీమియర్ రూమ్స్ , సుపీరియర్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని 32 వెల్ అపాయింట్ రూమ్స్, ఏసి స్టాండర్డ్ రూమ్స్ 24 గంటలు రూమ్స్ సర్వీసెస్, మినీ బార్, ట్రావెల్ అసిస్టెంట్స్ , డాక్టర్ అండ్ కాల్ , మల్టీ కజిన్ రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్, బ్యాం కిట్ హాల్, సదుపాయాలన్నీ ఉన్నాయని నగర ప్రజలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కస్టమర్లు వినియోగించుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, హోటల్ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.