-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టవలసిన పనుల్లో అంచనా రూ.168.16 కోట్ల తో మంజూరు చేసిన 413 పనులను పూర్తి చేసే విధానం లో, అదేవిధంగా జగనన్న హౌసింగ్ లే అవుట్ లలో పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. సామూహిక మరుగుదోడ్ల నిర్మాణం పనులు గత రెండు నెలలుగా అత్యంత తక్కువ గ్రౌండింగ్ అవ్వటం పై మండల వారీగా వివరణ కోరారు.
శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణ నీటి సరఫరా సంస్థ క్షేత్ర స్థాయి అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత జిల్లాలో ఏ పని చేపట్టినా గ్రౌండింగ్ అయ్యాయని, పనులు ప్రగతి లో ఉన్నాయని అంటే వాటిని పరిగణన లోకి తీసుకోవడం జరగదన్నారు. కమ్యూనిటీ టాయ్లెట్స్ నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. ఆయా పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధికారులదే అన్నారు. టాయిలేట్స్, ఓవర్ హెడ్ ట్యాంక్ లు, జె జే ఎం పనులను చేపట్టి పూర్తి చెయ్యడానికి ఒక వేళ కాంట్రాక్టర్ లు ముందుకు రాక పోతే అటువంటి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
తిరిగి చేపట్టవలసి ఉన్న 359 పనులకు ₹.145.84 కోట్ల కు అంచనా తో చేపట్టిన పనుల్లో 230 పనులు ప్రారంభం అయిన దృష్ట్యా ఆయా పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వీటిలో 145 పూర్తి కాగా మిగిలిన వాటిలో 50 పనులు పురోగతి లో ఉన్నా, ఇంకా 35 పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో కడియం లో 6, అనపర్తి డివిజన్ లో 26, కొవ్వూరు డివిజన్ లో 3 పనులను త్వరితగతన ప్రారంభించా లన్నారు.
జగనన్న కాలనీల లే అవుట్ లలో త్రాగునీరు సరఫరా కోసం అవసరమైన పనులను ప్రారంభించి పూర్తి చెయ్యవలసి ఉందని కలెక్టర్ మాధవీ లత తెలిపారు. డిసెంబర్ 21 న జిల్లాలో ఏడు జగనన్న లే అవుట్ లలో గృహ ప్రవేశాలు కార్యక్రమం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న దృష్ట్యా వాటికి సంబంధించి పనులు పూర్తి చెయ్య డానికి ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలకు చెందిన పనులను పూర్తి చెయ్యాలని కలెక్టర్ మాధవీలత తెలిపారు. నిర్దుష్ట మైన పనులకు కేటాయించిన మెటీరియల్ సంబందించిన పనుల కోసం వినియోగించాలన్నారు. ఎప్పటి కప్పుడు పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చెయ్యవల సిన బాధ్యత అధికారుల దే అన్నారు. ప్రతి గురువారం రాష్ట్ర స్థాయి అధికారులు పనుల పురోగతి పై సమీక్ష చేస్తున్న దృష్ట్యా ఆమేరకు బుధవారం నాటికి లక్ష్యం మేరకు ప్రణాళిక ప్రకారం నివేదిక అందజేయ్యాలన్నరు. ఎప్పటి కప్పుడు నిధులు విడుదల అవుతున్న శాఖ జలవనరుల శాఖ అన్నారు . ఎట్టి పరిస్థితుల్లోనూ మీ లక్ష్యాలను సాధించడానికి చొరవ చూపాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డి. బాలశంకర్ రావు, డిప్యూటీ ఈ ఈ లు టి. శ్రీనివాస రావు, ఎన్. అప్పారావు, కే. వేణుగోపాల్ రావు, రవి కుమార్, సహాయ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News