-జెసి తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం సాయంత్రం నాటికి 27,772 మంది రైతుల నుంచి 1,35,248. 240 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నాడు ఒక్క రోజులో 2,033 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో జరిగిన లావాదేవీలకు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.33.33 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. వాటి వివరాలు ఆయా అర్భికే ల వద్ద నోటీస్ బోర్డు లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. రైతులు తమ సందేహాల నివృత్తి కోసం జిల్లా కార్యాలయం 8309487151 లేదా 08832940788 వద్ద కంట్రోల్ రూమ్‌ను ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంప్రదించవచ్చు అని జేసీ తెలిపారు.