Breaking News

పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పక్రియపై , మండల తహసీల్దార్లు, పౌరసఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో ఆర్బీకే లు వారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ సమీక్షిస్తూ జిల్లాలో రైతుకు అవసరమైన గన్ని బాగ్స్ ఒక రోజు ముందుగానే సిద్దం చేసుకొని రైతుకు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు లో రైతు నుంచి ఎటువంటి ఫిర్యాదు లు వచ్చినా సంబంధిత అధికారులు , సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా ఆర్బీకేలు ద్వారా సేకరించి మిల్లులకు పంపుతున్న ధాన్యం వివరాలు ఆన్ లైన్ ద్వారా వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చెయ్యాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ధాన్యం రవాణా, గన్ని బాగ్స్ సరఫరా విషయం లో వ్యక్తి భాద్యతతో రైతుకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గోకవరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయ్యాలన్నారు. రైతు ధాన్యం ఏ మిల్లుకు అనుసంధానం చేశారో ఆ రైస్ మిల్లు రైతుకు గన్నిబాగ్స్ సరఫరా చేసేలా, మండల ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గోకవరం, కోరుకొండ, సీతానగరం మండల తహసీల్దార్లు కార్యాలయాల్లో తేమ శాతాన్ని ధ్రువీకరించే మాయిచ్చుర్ మిషన్స్ ఏర్పాటు చెయ్యాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా లో ఇప్పటి వరకు ఈకేవైసీ 98 శాతం అయ్యిందని, మిగిలినది కూడా పూర్తిచేయ్యాలన్నారు. ధాన్యం రవాణా పక్రియలో ట్రాన్స్ పోర్ట్ సంబందించిన చార్జీలు ఎవరైనా రైతులు నుంచి వాసులు చేసినట్లు మా దృష్టికి వస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని డిఎస్ఓ ను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ లో మండల తాహాసిల్దారులు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ, , మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *