రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోపాలపురం మండలం వెళ్ళచింతలగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి చెరుకుమిల్లి వినయ్ కు స్పందనలో దరఖాస్తు చేసిన వెంటనే విబిన్న ప్రతిభావంతుల శాఖ నుండి ట్రై సైకిల్ అందజేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. చెరుకుమిల్లి వినయ్ దరఖాస్తూ చేసిన వెను వెంటనే విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా రూ.6,500 విలువ గల ట్రై సైకిల్ ను జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ విద్యార్థితో మాట్లాడుతూ చదువుకు అంగ వైకల్యం అడ్డురాదని బాగా చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో, జి. నరంశిహులు, విభిన్న ప్రతిభా వంతుల శాఖ సూపరింటెండెంట్ బి. నాగభూషణం పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …