Breaking News

28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు గోదావరి జిల్లా లో పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 28 బుధవారం భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు గోదావరి జిల్లా లో స్వల్ప కాలిక పర్యటన నిమిత్తం రాజమండ్రీ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం మధురపూడి విమానాశ్రయం లాంజ్ లో జిల్లా అధికారులు, ఎయిర్ పోర్ట్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, ఫైర్, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి తో కలిసి ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత , రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రతి అధికారి వారికి కేటాయించిన ఎటువంటి డివియేషన్ లేకుండా నిర్వహించాలని కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా అమలు చేయడం కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక పై కలెక్టర్ దిశా నిర్దేశనం చేశారు. ఈ పర్యటన నిమిత్తం డ్యూటీ లు వేసిన, పాసులు జారీ చేసిన అధికారులకు, సిబ్బందికి కోవిడ్ రాపిడి టెస్ట్ లు చెయ్యలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, ఎ ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు ప్రకాశ రావు, ఎమ్ వి ఎస్ స్వామి, జిల్లా అధికారులు పి. జగదంబ, పి. ప్రసాద రావు, డా కె. వేంకటేశ్వర రావు, డా. సనత్ కుమారీ, అదనపు ఎస్పీ జీ. వెంకటేశ్వర రావు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి జిల్లా పర్యటన వివరాలు :
డిసెంబర్ 28 బుధవారం ఉదయం 7.20 కి బోలారం (తెలంగాణ) రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి ఉ.7.40 కి హకింపేట ఏ ఎఫ్ స్టేషన్ కు చేరుకుని అక్కడ నుంచి ఉ.7.50 కి బయలుదేరి ఉ.8.50 కి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం స్వల్ప విరామం తదుపరి ఉ.9.00 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉ.,9.50 కి భద్రాచలం చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *