విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) ఆదివారం నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల సందర్భంగా జిల్లాలోని అన్ని పరిక్షా కేంద్రాల వద్ద పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన పటిష్ట భద్రతా ఏర్పాట్లను స్వయంగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్ పరిశీలించారు. అనంతరం పరీక్షా కేంద్రాల వద్ద బంధోబస్త్ నిర్వహించు అధికారులకు మరియు సిబ్బందికి చెయ్యవల్సిన వివిధ ఏర్పాట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు సలహాలను అందించారు. ప్రతీ అభ్యర్థిని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది తనిఖీ చేయు విధానంను స్వయంగా పర్యవేక్షించి, అక్కడ పరీక్షల తీరును స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ….. జిల్లాలోని అన్ని పరిక్షా కేంద్రాల వద్ద పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. కానిస్టేబుల్ పరీక్షకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షకు సుమారుగా 98 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రతి పరిక్షా కేంద్రం వద్ద ఎస్సై స్థాయి అధికారులను, 2000 పైబడి అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఏ.సి.పి. అధికారిని పర్యవేక్షణ అధికారులుగా నియమించి పర్యవేక్షించడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్.పి పి.జాషువా ఐ.పి.ఎస్., డి.సి.పి.లు డి.మేరీ ప్రశాంతి ఐ.పి.ఎస్., మోకా సత్తిబాబు, కె శ్రీనివాస్, ఏ.డి.సి.పి.లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News